హైదరాబాద్: దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, దీరజ్ వాద్వాన్‌లు ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. యెస్ బ్యాంకు కేసులో ఇద్దరు సోదరుల్ని సీబీఐ విచారిస్తున్నది. అయితే ఆ కేసులో మే 4వ తేదీ వరకు వాద్వాన్ సోదరుల్ని రిమాండ్‌లోకి తీసుకోవాలంటూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఏప్రిల్ 26వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ లో వాద్వాన్ సోదరుల్ని అరెస్టు చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆ ఇద్దరు సోదరులు తమ ఫ్యామిలీతో కలిసి ముంబై నుంచి మహాబలేశ్వర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే యెస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ అవినీతి కేసులో వాద్వానా సోదరులకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.