ఢిల్లీ ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నాం..

 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నామని తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్న నేపథ్యంలో గౌతమ్‌ గంభీర్‌ మీడియాతో మాట్లాడుతూ..అరవింద్‌ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు. ఢిల్లీ ప్రజల్లో మాపై నమ్మకం కలిగించలేకపోయాం. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో  ఢిల్లీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు